చిలకలూరిపేటలోని గాంధీపేట 4వ లైన్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఓ నివాస భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాత్రం పానకాలు అనే వ్యక్తికి ...
చిలకలూరిపేటలోని గాంధీపేట 4వ లైన్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఓ నివాస భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాత్రం పానకాలు అనే వ్యక్తికి చెందిన ఈ భవనం కింది అంతస్తులో అద్దెదారులు నివసిస్తుండగా, రెండో అంతస్తును స్టోర్ రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. అకస్మాత్తుగా ఆ స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగి పైనుంచి నిప్పురవ్వలు కిందపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కింది అంతస్తులోని వారిని అప్రమత్తం చేసి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, స్టోర్ రూమ్‌లో ఉన్న ఏసీ, ఫర్నిచర్ సహా పలు విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
COMMENTS