చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిష్టాత్మక 'లీలావతి హాస్పిటల్స్'లో మరో అత్యవసర, క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది...
చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిష్టాత్మక 'లీలావతి హాస్పిటల్స్'లో మరో అత్యవసర, క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళకు ఆధునిక లాపరోస్కోపిక్ విధానంలో ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వివరాలు డాక్టర్ సుష్మ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ప్రాణాపాయ స్థితిలో రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ..
గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్‌లో పిండం పెరిగి, అది పగిలిపోవడాన్ని వైద్య పరిభాషలో 'రైట్ రప్చర్డ్ ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ' అంటారు. ఇది రోగి ప్రాణాలకే అత్యంత ప్రమాదకరమైన స్థితి. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయంలో ఉన్న ఈ విపత్కర పరిస్థితికి డాక్టర్ సుష్మ తక్షణమే స్పందించి చికిత్సకు ఉపక్రమించారు.
అత్యాధునిక 'లాపరోస్కోపిక్' చికిత్స..
కేసు తీవ్రతను వెంటనే పసిగట్టిన డాక్టర్ లావు సుష్మ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యాధునిక వైద్య విధానమైన 'లాపరోస్కోపిక్ రైట్ సాల్పింగెక్టమీ' శస్త్రచికిత్సను ప్రారంభించారు. సాంప్రదాయ పద్ధతిలో పొత్తికడుపును పూర్తిగా కోయకుండా, అత్యంత నైపుణ్యంతో లాపరోస్కోపీ ద్వారా స్క్రీన్ మీద గమనిస్తూ దెబ్బతిన్న భాగాన్ని తొలగించి సర్జరీని విజయవంతం చేశారు.
వైద్యరంగంలో డాక్టర్ లావు సుష్మ మార్క్..
చిలకలూరిపేట లాంటి ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని, అత్యాధునిక లాపరోస్కోపిక్ సేవలను అందుబాటులోకి తేవడంలో లీలావతి హాస్పిటల్స్, డాక్టర్ లావు సుష్మ ఎప్పుడూ ముందుంటారు. అత్యవసర సమయాల్లో సెకన్ల వ్యవధిలో సరైన నిర్ణయం తీసుకోవడం, ఆమె అపారమైన వైద్య అనుభవం ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించాయి. క్లిష్టమైన సర్జరీలను సైతం ఎంతో అవలీలగా చేస్తూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలుస్తున్న డాక్టర్ సుష్మ నైపుణ్యం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
COMMENTS